మ్యాంగో ఐస్‌క్రీమ్‌ను ఎలా తయారు చేస్తారు?
, మంగళవారం, 23 జులై 2013 (16:12 IST)
కావాల్సిన పదార్థాలు:- రెండు కప్పుల మామిడి పండు ముక్కలు, ఒకటిన్నర కప్పులు పంచదార, రెండు టేబుల్ స్పూన్ల నిమ్మరసం, రెండు కప్పుల పాలు, 5 కోడిగుడ్ల పచ్చసొన, ఒక కప్పు క్రీమ్. ఎలా తయారు చేస్తారు:- ముందుగా మామిడి ముక్కలు, అరకప్పు పంచదార, నిమ్మరసాన్ని గాజు పాత్రలో కలుపుకోవాలి. ఆ తర్వాత మూతపెట్టి ఓ గంటన్నరపాటు ఫ్రిజ్‌లో ఉంచాలి. పాలు కలిపిన కస్టర్డ్ తయారు చేసుకోవాలి. గుడ్డుసొనను, గిలక్కొట్టి ముప్పావు కప్పు పంచదార కలపాలి. వేడి పాలుపోసి బాగా గిలక్కొట్టాలి. ఈ మిశ్రమాన్ని తిరిగి పాన్‌లో పోసి మధ్యస్థంగా ఉండే సెగపై వేడిచేయాలి. మూత పెట్టకుండా చెక్క, గరిటెకు బాగా అంటుకునే స్థాయిలో చిక్కబడేదాకా సుమారు మూడు నాలుగు నిమిషాలు అలానే ఉంచాలి. ఆ తర్వాత బోల్‌లోకి వడకట్టి చల్లారనిచ్చి ఫ్రిజ్‌లో ఉంచినట్టుయితే, మ్యాంగో ఐస్‌క్రీమ్ రెఢీ.