మొక్కజొన్న తోటలో... "ఫ్రేకార్న్ లడ్డూలు"
కావలసిన పదార్థాలు :ఫ్రేకార్న్.. ఒక కేజీమంచినీరు.. తగినన్నినూనె.. తగినంతపంచదార పొడి.. 1 కేజీ 200 గ్రా.ఛాయ పెసరపప్పు.. పావు కేజీనెయ్యి.. పావు కేజీకోవా.. 200 గ్రా.జీడిపప్పు.. 50 గ్రా.కిస్‌మిస్.. 25 గ్రా.యాలకుల పొడి.. ఒకటిన్నర టీ.పచ్చ కర్పూరం.. పావు టీ.తయారీ విధానం :ఫ్రేకార్న్(మిక్చర్ కోసం వాడే మొక్కజొన్న ఫ్లేక్స్)ను నూనెలో దోరరంగు వచ్చేవరకూ వేయించి చల్లార్చాలి. తరువాత వాటిని మిక్సీలో గ్రైండ్ చేసి పొడిలా చేయాలి. పెసరపప్పును నానబెట్టి, నీళ్లు వార్చి నూనెలో వేయించి కార్న్ మాదిరిగానే చల్లారాక పొడి చేయాలి. మందపాటి పాత్రలో పంచదార, తగినన్ని నీళ్లు పోసి తీగపాకం పట్టాలి. అందులో యాలకులపొడి, పచ్చకర్పూరం పొడి, కోవా వేసి బాగా కలపాలి.తరువాత అందులో ఫ్రేకార్న్స్ పొడి, పెసరపప్పు పొడి వేసి బాగా కలిపి కాస్త వేడిగా ఉండగానే లడ్డూలు చుట్టుకోవాలి. వీటికి పైన ఓ కిస్‌మిస్‌ను, జీడిపప్పును అద్దితే చూడ్డానికి అందంగా ఉంటాయి. వీటిని ఓ పూట ఆరనిచ్చి డబ్బాలో పెట్టుకుంటే పదిరోజుల వరకూ నిల్వ ఉంటాయి. వీటిలో పప్పుదినుసులు తక్కువగా ఉండటంతో జీర్ణకోశ సమస్యలు తలెత్తవు.