కావలసిన పదార్థాలు :
లేత మొక్కజొన్న గింజలు... నాలుగు కప్పులు
పాలు... నాలుగు కప్పులు
కోవా... 200 గ్రా.
పంచదార... 300 గ్రా.
నెయ్యి... వంద గ్రా.
జీడిపప్పు... నాలుగు టీ.
కిస్‌మిస్... నాలుగు టీ.
యాలకుల పొడి... ఒక టీ.
తయారీ విధానం :
మొక్కజొన్న గింజల్ని మెత్తగా రుబ్బాలి. అడుగు మందం గిన్నెలో గింజల ముద్దను వేసి, పాలు పోసి కోవాలా అయ్యేవరకూ మరిగించాలి. కోవాలా చిక్కబడ్డ తరువాత నెయ్యి వేసి కొంచెం సేపు తిప్పాలి. ఆపై కోవా, పంచదార వేసి మరో 5 నిమిషాలు ఉడికించి దించేయాలి. యాలకుల పొడి, జీడిపప్పు, కిస్‌మిస్ వేసి నెయ్యి రాసిన ప్లేటులో వేసి ఆరిన తరువాత చాకుతో ముక్కలుగా కోసి సర్వ్ చేయాలి. అంతే తియ్యతియ్యని మొక్కజొన్న హల్వా రెడీ అయినట్లే...!