కావలసిన పదార్థాలు :
మైదా పిండి... పావు కేజీ
పెరుగు... అర కప్పు
వంటసోడా... కాస్తంత
పంచదార... వంద గ్రా.
చిక్కటి పాలు... ముప్పావు లీ.
యాలకుల పొడి... అర టీ.
తయారీ విధానం :
మైదాపిండిని జల్లించి ఓ గిన్నెలో వేసి అందులో పెరుగు, వంటసోడా, కొద్దిగా వేడినీళ్లు పోసి కాస్త జారుగా కలిపి మూడు గంటలు నానబెట్టాలి. మందపాటి గిన్నెలో నీళ్లు పోసి మరిగించాలి. తరవాత పులిసిన పిండిని బూందీ గరిటెమీద వేసి చేతితో పాముతూ పాలతాలికల మాదిరిగా వత్తాలి. వీటిని ఓ రెండు నిమిషాలు ఉడికించి తీయాలి. మరో గిన్నెలో పాలను మరిగించి పంచదార, యాలకులపొడి వేసి కలిపి ఉంచాలి. ఉడికించి తీసిన తాలికలను ఇందులో కలిపి వడ్డించాలి.