మిల్క్ - డ్రైఫ్రూట్ కోవా తయారు చేయడం ఎలా..!!
, మంగళవారం, 17 ఏప్రియల్ 2012 (15:46 IST)
కావలసిన పదార్థాలు :పాలు - రెండు లీటర్లు;చక్కెర - 150 గ్రా, సిల్వర్ పేపర్;టూటీ ఫ్రూటీ, చెర్రీ ముక్కలు - పది గ్రాములు;కుంకుమ పువ్వు - అర గ్రాము.చేసే విధానం :పాలను దగ్గరగా వచ్చే వరకు మరిగించాలి. కోవా దశకు వచ్చిన తర్వాత చక్కెర వేసి మరికొంత సేపు మరిగించాలి. ఈ మిశ్రమం బాగా దగ్గరైన తర్వాత దించి రెండు భాగాలు చేయాలి. ఒక భాగంలో కుంకుమపువ్వు, ఏలకుల పొడి, టూటీఫ్రూటీ, చెర్రీ వేసి కలపాలి.ఒక ట్రేలో సిల్వర్ పేపర్ వేసి టూటీఫ్రూటీ కలపని భాగాన్ని వేసి సమంగా సర్దాలి. దాని పైన టూటీఫ్రూటీ ఉన్న మిశ్రమాన్ని ఉంచి రోల్ చేయాలి. ఇలా చేస్తే లోపల కుంకుమపువ్వు కలిపిన కోవా మిశ్రమం, పైన తెల్లగా ఉన్న కోవా మిశ్రమం ఉంటాయి. పొడవుగా ఉన్న రోల్‌ని కావల్సిన సైజ్‌లో కట్ చేసుకోవాలి. ఈ మిల్క్ డ్రై ఫ్రూట్ కేక్ పైన తెల్లగా, లోపల కలర్‌ఫుల్‌గా ఉండి ఆకర్షణీయంగా కనిపిస్తాయి.