కావలసిన పదార్థాలు:
డార్క్ చాకొలెట్ -200 గ్రాములు
వైట్ మిల్క్ చాకొలెట్-50 గ్రాములు
కాజూ పలుకులు-100 గ్రాములు
చక్కెరా- 150 గ్రాములు
తయారీ విధానం:
డార్క్ చాకొలెట్‌ను చిన్న ముక్కలుగా తరిగి గిన్నెలో వేసి ఆవిరి మీద కరిగించుకోవాలి. గిన్నెను తీసి మరికొద్దిసేపు వేడిచేస్తే చాకొలెట్ కాస్త గట్టిపడుతుంది. వైట్ మిల్క్ చాకొలెట్‌ని కూడా ముక్కలుగా తరుగుకుని ఆవిరి మీద కరిగించి ఒక స్పూనుతో దాన్ని తీసుకుని శుభ్రపరచిన అచ్చులో సన్నని దారంలాపోస్తూస్పూనును అటూ ఇటూ విదిలించాలి. ఆ తర్వాత డార్క్ చాకొలెట్‌ను కొద్దిగాపోసి నాలుగు నిమిషాలపాటు చల్లార్చిన వెంటనే అచ్చును తలకిందులుగా తిప్పిన కొద్ది సెపటికి అచ్చుకు మందమై చాకొలెట్ పొర ఏర్పడుతుంది. చక్కెరా, కాజూ కలిపి బంగారు రంగు పాకం వచ్చేవరకు కరిగించి నూనె పూత పూసిన ప్లేట్లలోవేసి చల్లార్చి చిన్న చిన్న పలుకులుగా చిదమాలి. ఈ పలుకులను చాకొలెట్ అచ్చుల మధ్యలో వేసి మిగిలిన డార్క్ చాకొలెట్‌ను పైనుండి పోసెయాలి. ఈ అచ్చులను పదిబహెను నిమిషాలపాటు ఫ్రీజర్‌లో ఉంచి తియ్యాలి.