మహారాష్ట్రవారికి ఇష్టమైన పెరుగు స్వీట్ "శ్రీకండ్"
కావలసిన పదార్థాలు :తియ్యటి పెరుగు.. ఒక లీ.పంచదార పొడి.. ఒక కప్పుయాలకులపొడి.. ఒక టీ.పాలు.. ఒక టీ.పిస్తాపప్పు.. ఒక టీ.బాదంపప్పు.. పదిచారోలిపప్పు.. ఒక టీ.మిఠాయి రంగు.. చిటికెడుతయారీ విధానం :పెరుగుని పల్చని వస్త్రంలో వేసి వదులుగా మూటలా కట్టాలి. అందులోని నీళ్లన్నీ పోయేవరకూ ఈ మూటను మూడు గంటలపాటు వేలాడదీయాలి. ఆ తరువాత ఒక టీస్పూను పాలలో మిఠాయిరంగుని కలపాలి. నీళ్లు కారిపోయిన పెరుగుని ఓ గిన్నెలో వేసి అందులో పంచదార పొడి, మిఠాయి రంగు కలిపిన పాలనీ వేసి గరిటెతో బాగా కలపాలి.పిస్తాపప్పు, చారోలి పప్పు, బాదంపప్పుల్ని విడివిడిగా, నూనె లేకుండా బాణలిలో వేయించి పెరుగు మిశ్రమంలో కలిపితే శ్రీకండ్ రెడీ. దీన్ని చిన్న చిన్న బౌల్స్‌లో సర్ది కాసేపు ఫ్రిజ్‌లో పెట్టి చల్లచల్లగా అందిస్తే ఎంతో రుచిగా ఉంటుంది. అంతే.. మన పొరుగునే ఉన్న మహారాష్ట్రీయులు చాలా ఇష్టంగా తినే శ్రీకండ్ సిద్ధమైనట్లే..!