"బ్రెడ్ మిఠాయి" చాలులేవోయ్ బడాయి...!!
కావలసిన పదార్థాలు :బ్రెడ్ స్లైసులు.. పదిపాలు.. అర లీ.క్రీమ్.. అర కప్పుపంచదార.. ఒక కప్పుమంచినీరు.. అర కప్పురోజ్ వాటర్.. రెండు టీ.కుంకుమపువ్వు.. చిటికెడుబాదం.. పదిపిస్తా.. పదినెయ్యి.. అర కప్పుతయారీ విధానం :బ్రెడ్‌ముక్కల అంచులు తీసేసి త్రికోణాకారంలో కోయాలి. నాన్‌స్టిక్ బాణలి తీసుకుని బ్రెడ్ ముక్కలు పరచి నెయ్యి వేస్తూ బంగారు వర్ణంలోకి వచ్చేదాకా రెండువైపులా వేయించి తీసేయాలి. పాలల్లో క్రీమ్ వేసి సగమయ్యేవరకూ మరిగించాలి. పంచదారలో కొద్దిగా నీళ్లు పోసి లేతపాకం రానివ్వాలి. ఈ పాకాన్ని కూడా పాలల్లో వేసి కలపాలి.నానబెట్టిన కుంకుమపువ్వు, రోజ్‌వాటర్, సన్నగా తరిగిన పిస్తా, బాదం ముక్కల్ని అందులోనే కలపాలి. ఇప్పుడు వెడల్పాటి బాణలి తీసుకుని అందులో బ్రెడ్ ముక్కలు పెట్టి ఈ పాలమిశ్రమాన్ని పోసి సిమ్‌లో ఉంచాలి. పాకం ఆవిరయ్యేవరకూ ఉంచి తీసేయాలి. అంతే బ్రెడ్ మిఠాయి తయారైనట్లే..!!