"బెల్లం గవ్వలు" హాంఫట్ చేసేద్దామా..?!
కావలసిన పదార్థాలు :మైదాపిండి... ఒక కేజీబెల్లం... ఒక కేజీబొంబాయి రవ్వ... ఒక కేజీవెన్నపూస... 8 టీ.నూనె... తగినంతతయారీ విధానం :మైదాను బాగా జల్లించాలి. బొంబాయిరవ్వను మైదాకు కలిపి వెన్నపూసను కరిగించి కలపాలి. ఈ పిండిలో కొద్దిగా నీళ్లుపోసి చపాతీ పిండిలాగా బాగా కలపాలి. ఈ పిండిని రెండు గంటలపాటు అలాగే ఉంచి గవ్వల అచ్చుతో గవ్వలు చేసుకోవాలి. పొయ్యిమీద బాణలిపెట్టి తగినంత నూనె పోసి బాగా కాచాలి.అందులో ఈ గవ్వలను వేసి ఎర్రగా వేయించి తీసేయాలి. గిన్నెలో బెల్లం వేసి తగినన్ని నీళ్లుపోసి తీగమాదిరిగా పాకం వచ్చేలా చేయాలి. తరువాత ఈ పాకాన్ని స్టవ్‌మీద నుంచి కిందకు దించి వేయించి ఉంచుకున్న గవ్వలను అందులో వేసి, మొత్తం గవ్వలన్నింటికీ పాకం పట్టేలా బాగా కలియబెట్టాలి. అంతే బెల్లం గవ్వలు రెడీ అయినట్లే...!