కావలసిన పదార్థాలు :
బెల్లం... 200 గ్రా.
శెనగపిండి... 200 గ్రా.
నెయ్యి... 25 గ్రా.
నూనె... వేయించేందుకు సరిపడా
ఉప్పు... సరిపడా
యాలకులపొడి... పావు టీ.
తయారీ విధానం :
బెల్లం చిన్న చిన్న ముక్కలుగా దంచి గిన్నెలో వేసి ఓ కప్పు నీళ్లు పోసి ఉంచాలి. శెనగపిండిలో కరిగించిన నెయ్యి వేసి కలపాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసి ముద్దలా చేయాలి. ఈ పిండిని చిన్నచిన్న ముద్దలుగా చేసుకుని జంతికల గొట్టంతో సన్న కారప్పూసలా నూనెలో ఒత్తి, వేయించి తీయాలి.
ఇప్పుడు నీళ్లు కలిపిన బెల్లంను స్టవ్‌మీద పెట్టి ముదురుపాకం రానివ్వాలి. తరువాత అందులో వేయించిన కారప్పూసను వేసి కలపాలి. చివరగా యాలకుల పొడి కూడా చల్లి చల్లార్చాలి. పాకం ఆరిన తరవాత ఉండలుగా చేసి గాలి చొరని డబ్బాలో పెట్టాలి. అంతే బెల్లం కరకజ్జాలు సిద్ధమైనట్లే..!