కావలసిన పదార్థాలు :
లేత మొక్కజొన్న గింజలు... నాలుగు కప్పులు
పంచదార... అరకిలో
నెయ్యి.. 100 గ్రా.
యాలక్కాయలు... ఐదు
జీడిపప్పు... రెండు టీ.
ఎండు ద్రాక్ష... ఒక టీ.
తయారీ విధానం :
గింజల్ని మెత్తగా రుబ్బి అందులోంచి పాలను పిండాలి. పొట్టులో కొంచెం నీళ్లు కలిపి మళ్లీ గట్టిగా పిండాలి. ఈ పాలను ఓ పక్కన ఉంచాలి. ఓ టీస్పూను నేతిలో జీడిపప్పు, ఎండుద్రాక్ష వేయించి తీయాలి. నాన్‌స్టిక్ పాన్‌లో పంచదార వేసి గ్లాసు నీళ్లు పోసి మరిగించాలి.
ఇప్పుడు మొక్కజొన్న పాలను పోసి గరిటెతో తిప్పుతూ ఉండాలి. ఇది చిక్కబడి ముద్దలా తయారవుతుంది. తరువాత అందులో నెయ్యి పోసి హల్వాలా అయ్యేదాకా తిప్పాలి. చివరగా యాలకులపొడి, నేతిలో వేయించి తీసిన ఎండుద్రాక్ష, జీడిపప్పు వేసి కలపాలి. ఇప్పుడు ఈ హల్వాను చిన్న పళ్ళెంలో వేసి చల్లారిన తరవాత ముక్కలుగా కోయాలి.