కావలసిన పదార్థాలు :
బియ్యంపిండి... రెండు కప్పులు
వంటసోడా... అర టీ.
మైదా... ఒక కప్పు
తెల్ల నువ్వులు... రెండు కప్పులు
బెల్లంపొడి... రెండు కప్పులు
యాలకులపొడి... రెండు టీ.
నూనె... నాలుగు కప్పులు
తయారీ విధానం :
ముందుగా మైదా, బియ్యంపిండి, వంటసోడాలను కలిపి అందులో నీళ్లు పోసి దోసెల పిండిలా చేయాలి. ఈ పిండిని కనీసం గంటసేపు నానబెట్టాలి. స్టవ్ మీద బాణలిపెట్టి నువ్వులు గోధుమరంగులోకి వచ్చేదాకా వేయించి, చల్లారిన తరువాత పొడిలా చేసి ఉంచాలి.
ఇప్పుడు బెల్లంపొడిని కూడా మిక్సీలో వేసి మెత్తగా చేసి, అందులో యాలకులపొడి, నువ్వులపొడిని వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఈ పూర్ణాన్ని నిమ్మకాయంత సైజులో ఉండలుగా చేయాలి. స్టవ్ మీద బాణలిపెట్టి నూనెపోసి మరుగుతుండగా నువ్వుల పూర్ణాలను పైన కలిపి ఉంచుకున్న మైదా పిండిలో ముంచి తీసి నూనెలో వేసి ఎర్రగా వేయించి తీసేయాలి. అంతే నువ్వుల బూరెలు రెడీ అయినట్లే..! నాలుగు రోజులపాటు నిల్వ ఉండే వీటిని చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు.