నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ... పిల్లలు, పెద్దలు ఇష్టపడే బాదంపప్పుల హల్వాను వెరైటీగా, చాలా సులభంగా ఎలా చేయవచ్చో తెలుసుకుందామా...?!
కావలసిన పదార్థాలు : బాదంపప్పులు... పావుకేజీ పంచదార... అర కేజీ చిక్కటి పాలు... అరలీటరు నెయ్యి... 200 గ్రాములు కుంకుమపువ్వు... తగినంత
తయారీ విధానం : ముందుగా బాదంపప్పులను ముందురోజు రాత్రే నీటిలో నానబెట్టి, పై పొట్టు వలిచి శుభ్రం చేసుకోవాలి. వీటిని రోట్లో వేసి మెత్తగా నూరుకోవాలి. నూరేటప్పుడు నీళ్లకు బదులుగా పాలును పోసి నూరుకోవాల్సి ఉంటుంది.
ఇప్పుడు అరకేజీ పంచదారకు నూరి ఉంచుకున్న బాదంపప్పు ముద్ద, మిగిలిన పాలు, రోలు కడిగిన నీరు అన్నీ కలిపి పొయ్యిమీద పెట్టి సన్నని మంటమీద ఉడికించాలి. సగం ఉడికిన తరువాత అందులో నెయ్యిని వేసి బాగా కలియబెట్టాలి.
ఈ మిశ్రమాన్ని కొంచెం గట్టిపడేదాకా అలాగే పొయ్యిమీదే ఉంచి... దించే ముందు కుంకుమపువ్వును కలపాలి. అంతే నోరూరించే బాదంపప్పుల హల్వా రెడీ అయినట్లే..!