కావలసిన పదార్థాలు :
పాలు.. 3 లీ.
పాలకోవా.. 150 గ్రా.
పచ్చికొబ్బరి చిప్పలు.. రెండు
పంచదార.. ఆరు టీ.
బాదం, పిస్తా, జీడి పప్పులు.. తగినన్ని
తయారు చేసే విధానం:
ముందుగా కొబ్బరిని తురిమి.. మెత్తగా రుబ్బి పాలు తీసుకోవాలి. ఓ మందపాటి గిన్నెలో పాలను, కొబ్బరి పాలను పోసి చిక్కగా ఉడికించాలి. తర్వాత పాలకోవా, పంచదార వేసి సన్నని సెగపై ఉడికించాలి. చివర్లో వేయించిన బాదం, పిస్తా, జీడిపప్పులను వేసి కలిపి దించేసి చల్లారబెట్టాలి. తరువాత దీన్ని ఫ్రిజ్‌లో ఉంచి చల్లబడ్డాక కూల్‌గా సర్వ్ చేయాలి. అంతే వెరైటీ అండ్ టేస్టీ కోకోనట్ ఖీర్ తయార్..! ఇంకేముందీ ఓ పట్టు పట్టేయాల్సిందే అనుకుంటున్నారా..? మరెందుకు ఆలస్యం...!!