కావలసిన పదార్థాలు :
పాలు.. ఒక లీటరు
చక్కెర.. ఒక కేజీ
నిమ్మరసం.. ఒక టీ స్పూన్
క్రీం... తగినంత
పిస్తాపప్పులు.. గుప్పెడు
తయారీ విధానం :
పాలలో నిమ్మరసం వేసి మరిగించి విరిగాక పలుచటి క్లాత్‌లో కట్టాలి. నీరంతా పోయాక పాలవిరుగు (పనీర్)ను పూరీల పీట మీద మెత్తగా అయ్యే వరకు వత్తాలి. ఒక పాత్రలో అరకేజీ చక్కెర, కొద్దిగా నీరు పోసి వేడి చేయాలి. కరిగేలోపుగా పనీర్‌ను కొద్దిగా చేతిలోకి తీసుకుని బాల్‌లాగా చేసి కాస్త నొక్కి పొడవుగా వచ్చేటట్లు చేసి మరుగుతున్న చక్కెర నీటిలో వేయాలి.
ఇలా పనీర్ మొత్తాన్ని అలా చేసి.. అరగంట సేపు ఉడికించాలి. తరువాత వాటిని తీసి పక్కనే వేరే పాత్రలో మిగిలిన అరకేజీ చక్కెరతో తయారు చేసిన పాకంలో మునిగేటట్లుగా వేసి అలాగే ఉంచేయాలి. సర్వ్ చేసే ముందు పాకంలోంచి తీసి అవసరమయితే క్రీం, పిస్తాలతో గార్నిష్ చేసి వడ్డించాలి. అంతే పాకీజా రెడీ అయినట్లే..!