బందర్ హల్వా తయారు చేయడం ఎలా...?
, శనివారం, 20 జులై 2013 (15:19 IST)
కావలసిన పదార్థాలు :గోధుమపిండి - 1 కిలో.జీడిపప్పు - 100 గ్రా.బెల్లం - 1 కిలో.నెయ్యి - 700 గ్రా.యాలుకల పొడి - 30 గ్రా.రెడ్ కలర్ - చిటికెడు.చాక్లెట్ కలర్ - చిటికెడు.తయారు చేసే విధానం:గోధుమపిండిని సరిపడినన్ని నీళ్ళతో ముద్దలా చేసి ఒక గిన్నెలో వుంచి ఆ ముద్ద మునిగేలా నీళ్ళు పోసి గంటన్నరపాటు నానబెట్టాలి. గోధుమపిండి ముద్దను బాగా కలిపి, వచ్చే గోధుమ పాలను వడగట్టి వుంచుకోవాలి. వడగట్టి వుంచిన గోధుమ పాలలో పైకి తేరుకున్న నీళ్ళు కొన్ని తీసేసి దానిలో రెడ్‌కలర్, చాక్లెట్ కలర్ కలపాలి. వేరే గిన్నెలో బెల్లం ముక్కలకు సరిపడినన్ని నీళ్ళు పోసి ముదురుపాకం వచ్చాక గోధుమపాలు కలపాలి. జీడిపప్పు వేసి కొద్దిసేపటి తరువాత సన్నటి సెగపై బెల్లం, పాలమిశ్రమంలో నెయ్యి కొద్దికొద్దిగా వేస్తూ కలుపుతూ వుండాలి. మిశ్రమాన్ని ట్రేలో వేసి చల్లారాక కావల్సిన సైజులో ముక్కలుగా కట్ చేసుకోవాలి.