కావలసిన పదార్థాలు :
బంగాళాదుంపలు... పావు కేజీ
పంచదార... 350 గ్రాములు
నెయ్యి... 350 గ్రాములు
పాలు... అరకప్పు
తయారీ విధానం :
బంగాళాదుంపలను మెత్తగా ఉడికించి, పొట్టుతీసి, పాలు కలిపి మెత్తగా రుబ్బుకోవాలి. పంచదారలో అరకప్పు నీటిని పోసి కొద్దిగా ఉండపాకం పట్టి దాంట్లో రుబ్బి ఉంచుకున్న బంగాళాదుంప ముద్దను వేసి కలపాలి. మధ్యమధ్యలో నెయ్యిని పోస్తూ బాగా కలియబెట్టాలి.
మైసూర్ పాక్‌లాగా ఒక పొంగు వచ్చిన తరువాత... వెంటనే నలుచదరంగా ఉండే వెడల్పాటి పళ్ళానికి నెయ్యిరాసి అందులో పోయాలి. మిశ్రమం అంతా పళ్లానికి సమానంగా సర్ది, ముక్కలుగా కోయాలి. అంతే బంగాళాదుంప సోంపాపిడి సిధ్దమైనట్లే... !
చిన్నపిల్లలు, పెద్దలు అందరూ ఇష్టంగా తినే బంగాళాదుంప సోంపాపిడి... మెత్తగా ఉంటుంది. రెండు రోజులకు మించి నిల్వ ఉండదు కాబట్టి, ఆలోగానే ఖర్చుపెట్టేయండి మరి..! అవసరం అనుకునేవారు జీడిపప్పులను నెయ్యిలో వేయించి సోంపాడి ఆరేందుకు ముందుగానే ఒక్కో పప్పును, పైన అంటించి ఆపైన ముక్కలుగా కోసుకోవచ్చు.