కావలసిన సామాన్లు :
బంగాళదుంపలు : పావుకిలో
పంచదార : 350 గ్రాములు
నెయ్యి : 200 గ్రాములు
పాలు : అరకప్పు
ఇలా చెయ్యాలి :
బంగాళ దుంపలను మెత్తగా ఉడికించి, పొట్టుతీసి, పాలు కలిపి మెత్తగా రుబ్బాలి. పంచదారలో అరకప్పు నీటిని పోసి, కొద్దిగా ఉండపాకం పట్టి, దానిలో రుబ్బిన ముద్దను వెయ్యండి. మైసూర్‌పాక్ మాదిరిగా మధ్యమధ్యలో నెయ్యి పోస్తూ కలియబెట్టాలి. మైసూరపాక్ మాదిరి పొంగు వచ్చిన వెంటనే పళ్ళానికి నెయ్యి రాసి, వెంటనే అందులో సర్ది ముక్కలుగా కోయాలి. ఇది మెత్తగా వుంటుంది. రెండురోజులపాటు నిలువ ఉంటుంది.