కావలసిన పదార్థాలు :
పైనాపిల్... ఒకటి
నెయ్యి... వంద గ్రా.
పంచదార... 350 గ్రా.
కోవా... వంద గ్రా.
బ్రెడ్‌ముక్కలు... వంద గ్రా.
తయారీ విధానం :
పైనాపిల్ పండును చెక్కు తీసి ముక్కలుగా కోసి మిక్సీలో వేసి ఓసారి తిప్పితే సగం మెత్తగానూ సగం ముక్కలుగానూ ఉంటుంది. ఈ పేస్ట్‌ను ఓ బాణలిలో వేసి, నెయ్యి కూడా వేసి నెమ్మదిగా తిప్పుతూ ఉడికించాలి. ఈ మిశ్రమం చిక్కబడుతుండగా పంచదార వేస్తే కాస్త పలచబడుతుంది. ఇప్పుడు కోవా, బ్రెడ్‌ముక్కలు జల్లి ముద్దగా అయ్యాక దించితే సరి.