కావలసిన పదార్థాలు :
మామిడి పళ్ళరసం.. 8 కప్పులు
చక్కెర.. ఒక కిలో
పాలు.. నాలుగు కప్పులు
నెయ్యి.. ఒక కిలో
బాదం తరుగు.. అర కప్పు
ఎండుద్రాక్ష.. సరిపడా
తయారీ విధానం :
ఒక పెద్ద బాణలిలో మామిడిరసం, చక్కెర, పాలు పోసి వేడి చేయాలి. మీడియం మంటమీద ఈ మిశ్రమాన్ని కలియదిప్పుతూ వేడిచేయాలి. పాకం గట్టిబడేంతదాకా అలాగే ఉంచి.. ఆపైన నెయ్యి పోసి కలియబెట్టాలి. పాత్ర అంచులకు మిశ్రమం అంటనివిధంగా తయారైన తరువాత ఒక పళ్లానికి నెయ్యిరాసి.. దాంట్లో పోయాలి. దానిపై బాదం తరుగు, ఎండుద్రాక్ష చల్లి.. కావాల్సిన సైజులో కట్ చేసి వేడి వేడిగా సర్వ్ చేయాలి. అంతే మామిడి హల్వా సిద్ధం..!