కావలసిన పదార్థాలు :
పాలు... ఒక లీటర్
పనీర్... పావుకేజీ
పంచదార... వంద గ్రాములు
రోజ్ ఎసెన్స్.. కొన్ని చుక్కలు
యాలక్కాయలపొడి... పావు టీస్పూన్
బాదం, పిస్తా పప్పులు... చెరో 25 గ్రాములు
తగరపు కాగితాలు... మూడు
తయారీ విధానం :
ముందుగా పనీర్‌ను మెత్తగా రుబ్బుకోవాలి. పాలు, పంచదార కలిపి సన్నటి మంటమీద ఉడికించాలి. లీటర్ పాలు అరలీటర్ అయ్యేదాకా అలా ఉడికిస్తూనే ఉండాలి. తరువాత అందులో రుబ్బుకున్న పనీర్‌ను వేసి బాగా కలియబెట్టాలి.
చివర్లో యాలక్కాయలపొడి.. వేయించిన బాదం, పిస్తాపప్పులు కూడా వేసి.. తగరపు కాగితంతో అలంకరించినట్లయితే, పనీర్‌తో తయారైన పాయసం రెడీ అయినట్లే..! సింపుల్‌గా తయారయ్యే ఈ పాయసాన్ని చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు.