పచ్చగా, తియ్యగా అలరించే "పిస్తా హల్వా"
కావలసిన పదార్థాలు :పిస్తాపప్పు... ఒక కప్పునెయ్యి.... ఒక కప్పుపాలు.. ఒక కప్పుచక్కెర... రెండు కప్పులుమిఠాయి రంగు.. కాస్తంతకుంకుమపువ్వు... కొద్దిగాబాదంపప్పు, జీడిపప్పు... కాసిన్నితయారీ విధానం :పిస్తా పప్పులను రెండుగంటలపాటు నానబెట్టి, కాసిన్ని పాలుపోసి మెత్తగా రుబ్బుకోవాలి. చక్కెరలో కాసిన్ని నీళ్లుపోసి లేతపాకం వచ్చిన తరువాత పిస్తా ముద్దను వేసి కలుపుతూ తక్కువ మంటమీద ఉడికించాలి. ఐదు నిమిషాల తరువాత నెయ్యి పోస్తూ కలుపుతూ ఉడికించాలి.కాసేపయ్యాక అందులో రంగు, బాదం, జీడిపప్పులు, కుంకుమ పువ్వు చేర్చి బాగా కలిపి, మిశ్రమం చేతికి అంటుకోకుండా ఉండేంతదాకా ఉడికించి దించేయాలి. అంతే పచ్చపచ్చాని పిస్తా హల్వా సిద్ధమైనట్లే..! మంచి రంగుతో ఆకర్షణీయంగా, రుచిగా ఉండే పిస్తా హల్వాను చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అయితే మరెందుకు ఆలస్యం మీరు కూడా తయారు చేసేయండి మరి...!!