కావలసిన పదార్థాలు :
బియ్యం.. ఒక కేజీ
ఎండుకొబ్బరి ముక్కలు.. ఒక కప్పు
పెసరపప్పు.. ఒక కప్పు
జీడిపప్పు.. 50 గ్రా.
పంచదార.. 300 గ్రా.
కిస్‌మిస్.. 50 గ్రా.
నెయ్యి.. 150 గ్రా.
పచ్చ కర్పూరం.. 2 గ్రా.
తయారీ విధానం :
బియ్యం, పెసరపప్పులను ముందుగానే ఉడికించి పక్కనుంచాలి. ఓ పాత్రలో నెయ్యి వేసి వేడయిన తరువాత కొబ్బరి ముక్కలు, జీడిపప్పు, కిస్‌మిస్‌లను వేసి రెండు నిమిషాలపాటు కలియదిప్పుతూ వేయించాలి. ముందుగా ఉడికించుకున్న అన్నం, పెసరపప్పు మిశ్రమాన్ని జతచేయాలి. పంచదార కలిపి బాగా కలియబెట్టి పచ్చకర్పూరం కూడా వేసి కలిపి దించేయాలి. అంతే చక్కెర పొంగలి సిద్ధమైనట్లే..!