పండగ పసందు "సేమ్యా హల్వా"
కావలసిన పదార్థాలు :సేమ్యా... రెండు కప్పులుపంచదార.. రెండు కప్పులునెయ్యి... ఒక కప్పుయాలకుల పొడి.. ఒక టీ.పచ్చికొబ్బరి కోరు... రెండు కప్పులుజీడిపప్పు.. వంద గ్రా.కిస్మిస్... 25 గ్రా.తయారీ విధానం :స్టవ్‌మీద కడాయి పెట్టి రెండు టీస్పూన్ల నెయ్యి వేసి జీడిపప్పు, కిస్మిస్ వేయించి పక్కన ఉంచాలి. సేమ్యాను కూడా దోరగా వేయించి పక్కన ఉంచాలి. అడుగు మందంగా ఉన్న గిన్నెలో 3 కప్పుల నీళ్లు పోసి స్టవ్‌మీద పెట్టాలి. బాగా మరిగిన తరువాత సేమ్యా వేసి మంట తగ్గించి కలుపుతూ ఉండాలి. సేమ్యా ఉడికాక, పంచదార వేసి, గట్టిపడేదాకా కలుపుతూ ఉండాలి.నెయ్యి, యాలకులపొడి, వేయించి ఉంచిన జీడిపప్పు, కిస్మిస్లు కూడా పై మిశ్రమంలో వేసి బాగా కలిపి గిన్నెకు అంటుకోకుండా మారిన తరువాత దాన్ని కిందకి దించాలి. ఓ పళ్లానికి నెయ్యి రాసి అందులో ఈ మిశ్రమాన్ని వేసి సమానంగా సర్ది ఆరిన తరువాత ముక్కలుగా కోసి, లేదా అలాగే కప్పులో వేసి కూడా సర్వ్ చేయవచ్చు. అంతే సేమ్యా హల్వా తయార్...!!