కావలసిన పదార్థాలు :
మైదా... పావు కిలో
పంచదార... అర కిలో
నూనె... పావు కిలో
తయారీ విధానం :
మైదా పిండి తీసుకొని జల్లెడపట్టి కొద్దిగా నెయ్యి వేసి పూరీల పిండిలా తడిపి ఒక గంటసేపు నానబెట్టాలి. తరువాత అరకిలో పంచదారను లేతపాకం పట్టి ఉంచుకోవాలి. మైదా పిండి అంతటినీ నిమ్మకాయంత ఉండలుగా చేసుకొని, చపాతి సైజులో వత్తుకోవాలి. నాలుగేసి మైదా చపాతీలను ఒక దాని మీద ఒకటి వేస్తూ వాటి మధ్యన కొద్దిగా నెయ్యి రాస్తూ చాపచుట్టలా చుట్టండి. తర్వాత ఆ చుట్టలను చాకుతో ఒక అంగుళం వెడల్పున ముక్కలుగా కోసుకోవాలి.
ఈ ముక్కలను నూనెలో బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించి పంచదార పాకంలో వేయాలి. అలా మొత్తం చేసిన తరువాత కాజాలను పాకం నుండి తీసి వేరే పాత్రలో వేసుకోవాలి. అంతే నోరూరించే కాజాలు రెడీ అయినట్లే...! తీపి తక్కువ కావాలనుకునే పంచదార పాకంలో తక్కువగా చక్కెర వేసుకుని చేసుకోవచ్చు.