కావలసిన పదార్థాలు :
నువ్వు పప్పు... పావుకేజీ
బెల్లం.... ముప్పావు కేజీ
డాల్డా లేదా నెయ్యి... వంద గ్రా.
బియ్యంపిండి... 150 గ్రా.
మైదా... 50 గ్రా.
తయారీ విధానం :
ముందుగా నువ్వుపప్పును శుభ్రపరచాలి. బెల్లాన్ని తరిగి గిన్నెలో వేసి, కొద్దిగా నీరుపోసి తీగపాకం పట్టాలి. తరువాత అందులో మైదాపిండి, నువ్వుపప్పు, బియ్యంపిండి... వేస్తూ, ఉండలు కట్టకుండా బాగా కలపాలి. తరువాత చిన్న చిన్న ఉండలుగా చేసి ఉంచాలి.
ఇప్పుడు ఓ బాణలిలో నెయ్యి లాదా డాల్డాని పోసి బాగా మరుగుతుండగా... పైన తయారుచేసిన ఉండలను బిళ్ళల్లాగా వత్తి ఇందులో వేయాలి. బాగా ఎర్రగా కాలిన తరువాత తీసివేసి ఆరాక పొడి డబ్బాలో నిల్వచేసుకోవాలి. అంతే తియ్యటి నువ్వు బిళ్ళలు సిద్ధమైనట్లే...!