కావలసిన పదార్థాలు :
గుండు మినపప్పు - పావు కిలో, పంచదార - అర కిలో, ఏలక్కాయలు - చెంచా, నూనె - వేయించడానికి సరిపడ.
తయారు చేయు విధానం :
ముందుగా మినపప్పును అరగంట సేపు నానబెట్టి గారెలకు రుబ్బుకునే విధంగా గట్టిగా, గుల్లగా ఉండేలా రుబ్బుకోవాలి. మరో వైపు ఓ పాత్రలో పంచదార వేసి తగినన్ని నీళ్లు పోసి పాకంలా చేసుకోవాలి. పాకం పడుతున్న సమయంలో ఏలక్కాయలను పొడిగా చేసుకుని అందులో వేయాలి. పాకం పట్టాక దించేయాలి.
బాణాలిలో నూనె వేసి కాగాక అందులో ముందుగా రుబ్బిపెట్టుకున్న పిండిని చిన్న ఉండలుగా చేసి వేయాలి. గోధుమ రంగు వచ్చేంత వరకు వేయించి తీసి పాకంలో వేయాలి. అరగంట సేపు ఉంచి సర్వ్ చేయాలి.