కావలసిన పదార్థాలు :
సన్నగా తరిగిన ఖర్జూరం, ఎండుద్రాక్ష, చెర్రీపండ్లు, ఇతర పప్పులు (డ్రైఫ్రూట్స్) ... అరకప్పు
రవ్వ... అరకప్పు
చక్కెర... 5 టీస్పూన్లు
నెయ్యి... రెండు టీస్పూన్లు
కార్డమోమ్ పౌడర్... ఒక పించ్
బాదంపప్పులు... ఆరు
నీళ్లు... ఒక కప్పు
పసుపు లేదా ఆరెంజ్ రంగు ఫుడ్ కలర్... 4 చుక్కలు
తయారీ విధానం :
ముందుగా రవ్వను ఒక టీస్పూన్ నెయ్యి వేసి బాగా వేయించి పక్కన పెట్టుకోవాలి. అలాగే సన్నగా తరిగిన డ్రైఫ్రూట్స్ ముక్కలను మరో టీస్పూన్ నెయ్యి వేసి 10 సెకండ్లపాటు సన్నని మంటమీద వేయించాలి. ఇప్పుడు అదే పాత్రలోకి కప్పు నీరు, చక్కెర, కార్డమోమ్ పౌడర్, ఫుడ్ కలర్లను వేసి బాగా కలియబెట్టి మంటను పెంచాలి.
నీరు మరుగుతుండగా వేయించి ఉంచుకున్న రవ్వను పోస్తూ గడ్డలు కట్టకుండా కలపాలి. మంటను తగ్గించి, మెల్లిగా కలుపుతూ రవ్వ బాగా ఉడికేదాకా అలాగే ఉంచాలి. ఉడికిన తరువాత దించేసి, సర్వింగ్ డిష్‌లోనికి ఆ మిశ్రమాన్ని మార్చి.. పైన సన్నగా తరిగిన బాదంముక్కలను చల్లి సర్వ్ చేయాలి. అంతే డ్రైఫ్రూట్స్ కేసరి రెడీ అయినట్లే...!