డేట్స్‌తో సరికొత్త విందు "షీర్ కుర్మా"
కావలసిన పదార్థాలు :పాలు.. రెండు లీ.పంచదార.. ఒకటిన్నర కప్పునెయ్యి.. అర కప్పుఖీర్ సేమ్యా లేదా సన్న సేమ్యా.. ఒకటిన్నర కప్పుబాదం, జీడి, పిస్తా పప్పులు.. తలా 15ఎండు ఖర్జూరాలు.. 8యాలకుల పొడి.. ఒక టీ.జాజికాయ పొడి.. ఒక టీ.తయారీ విధానం :బాదం, పిస్తా, జీడిపప్పులను చిన్న చిన్న ముక్కలుగా కోయాలి. స్టవ్ మీద బాణలి పెట్టి కొద్దిగా నెయ్యి వేసి అందులో బాదం, జీడిపప్పులను వేయించాలి. మరో పాత్రలో పాలు పోసి స్టవ్ మీద పెట్టాలి. పాలు కాగిన తరువాత పంచదార వేసి బాగా కలియబెట్టాలి.పంచదార పూర్తిగా కరిగిన తరువాత నెమ్మదిగా సేమ్యా వేస్తూ తిప్పాలి. మంట తగ్గించి సిమ్‌లో ఉంచి.. వెంటనే వేయించిన జీడిపప్పు, బాదం పప్పులను.. వేయించని పిస్తా ముక్కల్ని, గింజలు తీసివేసిన ఎండు ఖర్జూరం ముక్కల్ని వేసి బాగా కలపాలి. సేమ్యా ఉడికినట్లు అనిపించగానే.. స్టవ్ మీది నుంచి దించి యాలకుల పొడి, జాజికాయపొడి కలిపి వేడి వేడిగా సర్వ్ చేయాలి.