కావలసిన పదార్థాలు :
క్యారెట్ తురుము... ఒక కప్పు
జీడిపప్పు... గుప్పెడు
పాలు... నాలుగు కప్పులు
పంచదార... ఒక కప్పు
నెయ్యి... అర కప్పు
యాలక్కాయలపొడి... పావు టీ.
బాదంపప్పు, కిస్‌మిస్‌లు... చెరో రెండు టీ.
తయారీ విధానం :
ముందుగా క్యారెట్లను శుభ్రంగా కడిగి, తుడిచి పైపొట్టును తీసివేసి తురుముకోవాలి. దీన్ని నేతితో వేయించి పక్కనుంచాలి. క్యారెట్ ఉన్న పాత్రలోనే పాలుపోసి బాగా మరగనివ్వాలి. మరుగుతున్నప్పుడే పంచదార కూడా వేసి కరిగేదాకా తిప్పుతూ ఉండాలి. అందులోనే క్యారెట్ తురుము వేసి ఉడికించాలి.
ఈ మిశ్రమం కాస్తంత చిక్కబడిన తరువాత యాలక్కాయలపొడి వేసి దించేయాలి. చివర్లో నేతిలో వేయించిన జీడిపప్పు, బాదంపప్పు, కిస్‌మిస్‌లను కలపాలి. అంతే జీడిపప్పుతో క్యారెట్ ఖీర్ తయారైనట్లే..! పాలను విడిగా తాగలేని పిల్లలకు ఇలా క్యారెట్ ఖీర్ చేసి ఇచ్చినట్లయితే ఎంతో ఇష్టంగా తాగుతారు.