Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జాఫ్రాన్ కలర్‌తో అలరించే "కోవా రోల్స్"

Advertiesment
భారతీయ
FILE
కావలసిన పదార్థాలు :
పచ్చి పాలకోవా.. 250 గ్రా.
యాలకులు.. అర టీ.
జాఫ్రాన్ కలర్.. చిటికెడు
జీడిపప్పు.. 30 గ్రా.
జాజికాయ.. చిన్న ముక్క
పంచదార.. 300 గ్రా.

తయారీ విధానం :
ఓ మందపాటి గిన్నెలో పచ్చికోవా, పంచదారలను కలిపి సన్నని మంటమీద గరిటెతో కలుపుతూ మాడకుండా పాకం పట్టాలి. పాకం వచ్చిన తరువాత దానిని దించి గరిటెతో కలుపుతూ కోవాను చల్లార్చాలి. కొంచెం సేపటి తరువాత కోవా ముద్దలాగా తయారవుతుంది.

కాసింత కోవా ముద్దలో యాలకుల పొడి, జీడిపప్పు, జాఫ్రాన్ కలర్‌లు కలిపి పక్కన ఉంచుకోవాలి. మిగిలిన కోవా నుండి కొద్దిగా కోవా ముద్దను తీసుకుని పలుచగా చేసి, దాని మధ్యలో కలర్ కలిపిన మిశ్రమాన్ని పెట్టి చిన్న రోల్‌లాగా చుడితే కోవా రోల్స్ సిద్ధమైనట్లే..!

Share this Story:

Follow Webdunia telugu