కావలసిన పదార్థాలు :
చిలగడదుంపలు... అరకేజీ
నెయ్యి... 400 గ్రాములు
వంటసోడా... ఒక టీస్పూన్
చక్కెర... అర కేజీ
మైదా... 400 గ్రాములు
తయారీ విధానం :
చిలగడదుంపలను శుభ్రంగా కడిగి ఉడికించుకోవాలి. తరువాత పైతొక్క ఒలిచి గ్రైండర్‌లో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. మైదాపిండిని జల్లించుకుని దాంట్లో చిలగడదుంపల గుజ్జు, వంటసోడాను వేసి.. మెత్తగా కలుపుకోవాలి.
చేతికి కొంచెం నెయ్యి రాసుకుని, మైదాపిండిని చిన్న చిన్న ఉండలుగా కోడిగుడ్డు ఆకారంలో చేసుకోవాలి. పొయ్యిపై బాణలి పెట్టి, నెయ్యిపోసి బాగా కాగిన తరువాత మైదా ఉండలను ఒక్కోదాన్ని వేసి బాగా ఎర్రగా కాల్చి తీయాలి.
తరువాత ముందుగా తయారుచేసి ఉంచుకున్న చక్కెర పాకంలో వీటిని వేయాలి. ఈ గులాబ్ జామూన్‌లు ఒక్కరోజు నానిన తరువాత మెత్తగా అవుతాయి. అప్పుడు వీటిని కాసేపు ఫ్రిజ్‌లో ఉంచి చల్లబడిన తరువాత తింటే చాలా రుచిగా ఉంటాయి.