కావలసిన పదార్థాలు :
పచ్చి శనగపప్పు... అరకేజీ
బెల్లం... అరకేజీ
యాలక్కాయలపొడి... రెండు టీ.
మినప్పప్పు... వంద గ్రా.
బియ్యం... 200 గ్రా.
నూనె... వేయించేందుకు సరిపడా
తయారీ విధానం :
పచ్చిశనగపప్పును ప్రెషర్ కుక్కర్‌లో ఉడికించి, తరిగిన బెల్లం, యాలక్కాయలతో కలిపి మెత్తగా రుబ్బుకోవాలి. మినప్పప్పు, బియ్యాన్ని మూడు గంటలసేపు నానబెట్టి, వడబోసి, దోశెల పిండిలాగా మెత్తగా రుబ్బాలి. బూరెల కోసం తయారు చేసిన బెల్లం, శనగపప్పు మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండల్లాగా చేసి, ఒక్కోదాన్ని మినప్పిండి మిశ్రమంలో ముంచి.. బాగా కాగుతున్న నూనెలో వేసి ఎర్రగా కాల్చి తీసేయాలి. అంతే వేడి వేడి తియ్యటి చిట్టి బూరెలు సిద్ధమైనట్లే..!