చాక్లెట్ కాజాను ఎలా చేయాలో తెలుసా!?
, మంగళవారం, 15 ఏప్రియల్ 2014 (18:06 IST)
కావలసిన పదార్థాలు:చాక్లెట్ సాస్ - రెండు టేబుల్ స్పూన్లు మైదా- 2 రెండు కప్పులు నీరు - అరకప్పు కోకో పౌడర్ - పావు టీ స్పూన్ ఉప్పు - చిటికెడునూనె- వేయింపుకు తగినంత సిరప్ కోసం, చక్కెర- కప్పు ఏలకుల పొడి - చిటికెడు తయారీ విధానం :ముందుగా ఒక పాత్రలో మైదా, ఉప్పు, కోకో, పౌడర్లను కలిపి నీటితో ముద్దగా చపాతీల పిండిలా చేయాలి. పిండిని చపాతీల్లా వత్తి వాటిని రోల్ చేసి కట్ చేయాలి. ఈ ముక్కలను నూనెలో డీప్‌గా ప్రై చేయాలి. ఈ లోపుగా స్టౌ మీద ఓ పాత్రను పెట్టి చక్కెర, నీటిని కలిపి తగినంత మంట మీద మరిగించి సిరప్ చేసుకోవాలి. నూనెలో నుంచి తీసిన కాజాలను షుగర్ సిరప్‌లో వేసి ఒక నిమిషం ఉంచాలి. ఇలా చేసుకున్నా కాజాలను ఒక ప్లేట్లో అమర్చి.. చాక్లెట్ సాస్‌తో సర్వ్ చేయాలి.