"చంద్రవంకలు" చేయడం చాలా తేలిక..!
కావలసిన పదార్థాలు :పెసరపప్పు.. పావు కేజీజీడిపప్పు.. 25 గ్రా.పచ్చికొబ్బరికోరు... ఒక చిప్పదిచక్కెర.. పావు కేజీయాలక్కాయలు.. 25 గ్రా.పచ్చకర్పూరం.. కాస్తంతతయారీ విధానం :పెసరపప్పును మెత్తగా రుబ్బుకుని పచ్చికొబ్బరి కోరు, పంచదార కలిపి స్టౌమీద ఉంచి సుమారు పావుగంటసేపు ఉడికించాలి. ఉడుకుతున్నప్పుడు ఈ మిశ్రమం అడుగంటకుండా గరిటెతో తిప్పుతూ ఉండాలి. పెసరపిండి, కొబ్బరి, పంచదార అన్నీ బాగా ఉడికి గట్టిగా ముద్దలాగా మారిన తరువాత అందులో యాలక్కాయల పొడి, పచ్చకర్పూరం, జీడిపప్పు కలపాలి.కాసేపటి తరువాత ఈ మిశ్రమాన్ని ఓ గుడ్డపై పోసి కేక్‌ల మాదిరిగా డైమండ్ ఆకారంలో కట్ చేసుకోవాలి. వీటిని బాగా కాగుతున్న నూనెలో బంగారు వర్ణం వచ్చేదాకా వేయించి తింటే చాలా రుచిగా ఉంటాయి. వీటిని తయారు చేయడం కూడా చాలా తేలికే కదూ..?!