కావలసిన పదార్థాలు :
పిస్తా పప్పులు... అర కేజీ
పంచదార... అర కేజీ
నెయ్యి... రెండు టీ.
సిల్వర్ పేపర్... ఒకటి
గ్రీన్ కలర్... కొద్దిగా
తయారీ విధానం :
పిస్తా పప్పును మెత్తగా పౌడర్‌లాగా చేసుకోవాలి. కడాయిలో పంచదార పోసి కొద్దిగా నీరు పోసి, మీడియం మంటపై ఉంచి కలుపుతూ తీగపాకం వచ్చేలా చూడాలి. తర్వాత అందులో పిస్తాపొడి పోస్తూ, కలుపుతూ ఉండాలి. ఈ మిశ్రమం బాగా దగ్గరయ్యేదాకా కలపాలి.
చివర్లో దాంట్లో గ్రీన్ కలర్ వేసి బాగా కలిపి నెయ్యి రాసిన పళ్లెంలో పోసి, సమంగా పరచి రోల్ చేయాలి. దానిపై చాందీకావరబ్ లేదా సిల్వర్ పేపర్‌ను అద్దాలి. కాస్త ఆరిన తరువాత కావల్సిన సైజు ముక్కలుగా కోసి సర్వ్ చేయాలి. అంతే గ్రీన్ పిస్తా రోల్ సిద్ధమైనట్లే... ఎంతో రుచికరంగా ఉండే ఈ స్వీటు ఎక్కువకాలం నిల్వ ఉంటుంది కూడా..!!