Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గ్రాటెడ్ యాపిల్స్ హల్వా

Advertiesment
వంటకాలు స్వీట్లు గ్రాటెడ్ యాపిల్స్ చక్కెర నెయ్యి ఆల్మండ్స్ కార్డమోమ్ పౌడర్ పాత్ర హీట్ మిశ్రమం హల్వా
, శనివారం, 31 జనవరి 2009 (18:17 IST)
కావలసిన పదార్థాలు :
గ్రాటెడ్ యాపిల్స్... రెండు కప్పులు
చక్కెర... ఒక కప్పు
నెయ్యి... ఒక టీస్పూన్
సన్నగా తరిగిన ఆల్మండ్స్... రెండు టీస్పూన్లు
కార్డమోమ్ పౌడర్... అర టీస్పూన్

తయారీ విధానం :
ఒక మందపాటి పాత్రలో నెయ్యి వేసి వేడి చేయాలి. అందులో గ్రాటెడ్ ఆపిల్స్ వేసి కలిపి, మీడియం హీట్‌లో వేయించాలి. ఆపిల్స్‌లోని నీరంతా ఇంకిపోయి, బాగా ఉడికినట్లు అనిపించేదాకా అలాగే వేయించాలి. ఓ పదినిమిషాలు ఉడికిన తరువాత దాంట్లో చక్కెర కలపాలి.

ఆ మిశ్రమాన్ని బాగా మెత్తగా కలిపిన తరువాత, సన్నగా తరిగిన ఆల్మండ్స్‌ను కూడా వేసి కలియబెట్టాలి. ఆ మిశ్రమం బాగా పొడిపొడిగా అయిన తరువాత అందులో కార్డమోమ్ పౌడర్‌ను వేసి కలపాలి. సన్నటి మంటమీద అలాగే ఉంచి, ఆ పదార్థం గట్టిపడేదాకా ఉడికించి దించేయాలి. అంతే గ్రాటెడ్ యాపిల్స్ హల్వా రెడీ అయినట్లే...! ఇది వేడి వేడిగా ఉన్నప్పుడే అతిథులకు సర్వ్ చేయండి.

Share this Story:

Follow Webdunia telugu