గోవా తీపి వంటకం "సఫ్రాన్ మాంగ్‌నెమ్"
కావలసిన పదార్థాలు :శెనగపప్పు.. అర కేజీసగ్గు బియ్యం... 200 గ్రా.బెల్లం.. అర కేజీజీడిపప్పు.. వంద గ్రా.కుంకుమపువ్వు (సఫ్రాన్).. ఒక టీ.మంచినీళ్లు.. ఒకటిన్నర లీ.కొబ్బరి తురుము .. 2 కాయలదినెయ్యి.. ఒక టీ.తయారీ విధానం :సగ్గు బియ్యాన్ని ఒక రాత్రంతా నానబెట్టాలి. శెనగపప్పును కూడా రెండు గంటలపాటు నానబెట్టాలి. మంచినీటిలో శనగపప్పు వేసి కొంత ఉడికిన తరువాత, సగ్గుబియ్యం వేసి ఉడికించాలి. దాదాపుగా ఉడికిన తరువాత బెల్లం వేయాలి. తరువాత కొబ్బరి తురుము, నేతిలో వేయించి జీడిపప్పు వేసి బాగా ఉడికించాలి. దించేముందు పైన కుంకుమపువ్వు చల్లి వేడి వేడిగా సర్వ్ చేయాలి. అంతే ఘుమఘుమలాడే గోవా భోజనప్రియులకు ఇష్టమైన సఫ్రాన్ మాంగ్‌నెమ్ తయార్..! మీరూ ట్రై చేస్తారు కదూ..?!