కావలసిన పదార్థాలు :
గోధుమపిండి... 200 గ్రా.
పంచదార... 200 గ్రా.
పాలు... అర లీ.
నెయ్యి... 200 గ్రా.
కిస్మిస్... పది గ్రా.
జీడిపప్పు... పది గ్రా.
యాలకులు... ఐదు
ఎండు ద్రాక్ష... పది గ్రా.
తయారీ విధానం :
ఒక బాణలిలో నెయ్యి వేసి గోధుమ పిండిని అందులో వేయించాలి. గోధుమపిండి బాగా బంగారువర్ణంలోకి వచ్చిన తరువాత అందులో వేడి పాలు పోసి ఉడికించాలి. గరిటెతో ఈ మిశ్రమాన్ని కలుపుతూ పాలన్నీ ఇంకిపోయేదాకా ఉడికించాలి. ఈ క్రమంలో అడుగంటకుండా జాగ్రత్తపడాలి. మిశ్రమం గట్టిపడుతున్న సమయంలోనే పంచదారను కూడా వేసి అది పూర్తిగా కరిగేదాకా ఉంచాలి. చివర్లో జీడిపప్పు, యాలకులు, ఎండుద్రాక్షలను పైన చల్లి దించేయాలి. అంతే వీట్ గీ లాప్సీ తయారైనట్లే..!