కావలసిన పదార్థాలు :
క్యారెట్ తురుము... ఒక కప్పు
బియ్యం... ఒక కప్పు
పెసరపప్పు... అర కప్పు
పంచదార... ఒక కప్పు
నెయ్యి... అర కప్పు
యాలక్కాయల పొడి... అర టీ.
జీడిపప్పు, బాదంపప్పు, కిస్‌మిస్‌లు... చెరో రెండు టీ.
తయారీ విధానం :
బియ్యం, పెసరపప్పు కలిపి తగినన్ని నీళ్లు పోసి సమంగా ఉడికించుకోవాలి. క్యారెట్ తురుమును నేతిలో వేయించి, ఉడికించుకున్న అన్నాన్ని కూడా ఇందులో వేసి కాసేపు వేయించాలి. ఆ తరువాత దానికి పంచదార కలిపి, పాకంలా వచ్చేవరకూ ఉంచి, యాలక్కాయల పొడి వేసి దించేయాలి.
చివర్లో నేతిలో వేయించిన బాదంపప్పు, జీడిపప్పులతో పైన అలంకరించాలి. అంతే క్యారెట్ కేసరి బాత్ రెడీ అయినట్లే..! మీరూ ట్రై చేస్తారు కదూ..!