కొబ్బరితో ఘుమఘమలాడే "నేతి చలిమిడి"
కావలసిన పదార్థాలు :బియ్యం.. ఒక కేజీకొబ్బరికాయ.. ఒకటినెయ్యి.. 50 గ్రా.బెల్లం.. ముప్పావు కేజీగసగసాలు.. 50 గ్రా.తయారీ విధానం :బియ్యాన్ని శుభ్రంగా కడిగి, నీటిలో నానబెట్టి రెండు రోజులపాటు అలాగే ఉంచేయాలి. ఏ రోజుకారోజు నీటిని మారుస్తూ ఉండాలి. తర్వాత ఆ బియ్యాన్ని కాసేపు నీడలో ఆరబెట్టి.. గ్రైండర్‌లోగానీ, రోట్లోగానీ వేసి మెత్తగా పిండి కొట్టి.. జల్లించి ఉంచాలి. కొబ్బరికాయను పగులగొట్టి చిన్న చిన్న ముక్కలుగా చేసి నేతిలో వేయించి ఉంచాలి. గసగసాలను కూడా నేతిలో వేయించి ఉంచాలి.ఇప్పుడు తగినన్ని నీళ్లలో బెల్లాన్ని వేసి పాకం పట్టాలి. అందులో కొద్ది కొద్దిగా పిండిని పోస్తూ బాగా కలియబెడుతూ పాకంలో పిండి బాగా కలిసేలా చూడాలి. అలా పిండి బాగా కలిసింది అనుకున్న తరువాత వేయించిన కొబ్బరి ముక్కలను వేసి కలపాలి. చివర్లో ఈ మిశ్రమాన్ని స్టవ్ మీదినుంచి దించే ముందుగా గసగసాలను కూడా వేసి బాగా కలియదిప్పి దించేయాలి. చల్లారిన తరువాత అలాగే అయినా లేదా ఏదైనా షేప్‌లో చేసుకుని అయినా దీనిని తినవచ్చు. అంతే నేతి చలిమిడి రెడీ..!!