కావలసిన పదార్థాలు :
ఎండు కుబానీ పండ్లు- 1 కిలో
పంచదార- 1 1/2 కిలో
తాజామీగడ- తగినంత
బాదంపప్పు- తగినన్ని
కస్టర్డ్- కొద్దిగా
తయారీ విధానం:
కుబానీ పండ్లను ఓ రాత్రంతా నానబెట్టాలి. మర్నాడు గింజను వేరుచేసి గుజ్జును మెత్తగా గ్రైండ్ చేయాలి.ఇందులో పంచదార కలిపి తక్కువ మంట మీద ఉడికించి చిక్కటి పాకంలా అయ్యాక దించాలి. చివరగా దీన్ని ప్లేట్లలో సర్ది పాలమీగడ లేదా కస్టర్డ్, బాదంపప్పుతో అలంకరిస్తే రుచికరమైన కుబానీ కా మీఠా సిద్దంమవుతుంది.