కావలసిన పదార్థాలు :
ఎండు కుబానీపండ్లు... ఒక కేజీ
పంచదార... ఒకటిన్నర కేజీ
తాజా మీగడ... ఒక కప్పు
బాదంపప్పులు... అర కప్పు
కస్టర్డ్ పౌడర్... కొద్దిగా
తయారీ విధానం :
కుబానీ పండ్లను ఓ రాత్రంతా నానబెట్టాలి. మర్నాడు గింజను వేరుచేసి గుజ్జును మెత్తగా గ్రైండ్ చేయాలి. ఇందులో పంచదార కలిపి తక్కువ మంటమీద ఉడికించి చిక్కటి పాకంలా అయ్యాక దించాలి. చివరగా దీన్ని ప్లేట్లలో సర్ది పాలమీగడ లేదా కస్టర్డ్, బాదంపప్పుతో అలంకరిస్తే రుచికరమైన కుబానీ కా మీఠా తయార్..! హైదరాబాద్ వంటకంగా ప్రసిద్ధి చెందిన దీన్ని ఇక్కడి సంప్రదాయ ముస్లింలు భోజనం తరువాత ఎంతో ఇష్టంగా తింటుంటారు.