కావలసిన పదార్థాలు :
జీడిపప్పు పొడి... 50 గ్రాములు
నెయ్యి... అరకప్పు
చక్కెర... 150 గ్రాములు
మైదాపిండి... 50 గ్రాములు
యాలక్కాయల పొడి... అర టీస్పూన్
వేడిచేసిన నెయ్యి... మూడున్నర కప్పులు
తయారీ విధానం :
ఒక వెడల్పాటి గిన్నెలో జీడిపప్పు పొడి, మైదా, నెయ్యి, యాలక్కాయల పొడిని వేసి బాగా కలపాలి. మరో వెడల్పాటి మందపాటి అడుగున్న గిన్నెలో చక్కెర వేసి 1/3 వంతుల నీటిని పోసి.. స్టవ్‌పై పెట్టి తీగపాకం వచ్చేదాకా మరగనివ్వాలి.
ఇప్పుడు జీడిపప్పు పొడి, నెయ్యి, మైదా కలిపిన మిశ్రమాన్ని పంచదార పాకంలో వేసి గడ్డలు కట్టకుండా కలపాలి. అలాగే సన్నటి సెగమీద ఉంచి, కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మరో పాత్రలో వేడి చేసిన మూడున్నర కప్పుల నెయ్యిని ఇందులో పై నుంచి మెల్లిగా పోస్తూ కలపాలి.
నెయ్యి.. జీడిపప్పు మిశ్రమం నుండి విడిపోయి పైకి తేలేంతదాకా అలా కలుపుతూనే ఉండాలి. అలా తేలిన తరువాత వెడల్పాటి పళ్లానికి నెయ్యి రాసి పై మిశ్రమాన్ని అందులో పోసి సమంగా పరచాలి. ఒకవైపున మాత్రం చిన్న రంధ్రం చేయాలి. ఎందుకంటే ఆ రంధ్రం నుంచి మిశ్రమం చల్లారే క్రమంలో అదనంగా ఉండే నెయ్యి అంతా బయటకు వచ్చేస్తుంది. అంతే కాజు మైసూర్ పాక్ రెడీ అయినట్లే...!