కావలసిన పదార్థాలు :
బాంబినో సేమ్యా... అర కిలో
కలాకండ్... పావు కిలో
మంచి నీరు... తగినన్ని
పంచదార పౌడర్... ముప్పావు కిలో
నెయ్యి... పావు కిలో
ఛాయ పెసరపప్పు... పావు కిలో
ఎండుకొబ్బరి తురుము... వంద గ్రా.
ఎండు ఖర్జూరం... వంద గ్రా.
జీడిపప్పు... 50 గ్రా.
ఎండుద్రాక్ష... 25 గ్రా.
బెల్లం తురుము... 25 గ్రా.
యాలకుల పొడి... ముప్పావు టీ.
పచ్చ కర్పూరం... కొద్దిగా
తయారీ విధానం :
కొద్దిగా నెయ్యి వేసి జీడిపప్పు, ఎండు ఖర్జూరం, ఎండు కొబ్బరి తురుము దోరగా వేయించి ఉంచాలి. పెసరపప్పును ఉడికించి మెత్తగా మెదపాలి. మందపాటి కళాయిలో పంచదార, బెల్లం, తగినన్ని నీళ్లు పోసి పాకం పట్టి... అందులో కలాకండ్, వేయించిన డ్రైఫ్రూట్స్, ఉడికించిన పెసరపప్పు, యాలకుల పొడి, పచ్చకర్పూరం పొడి వేసి, నెయ్యి పోసి బాగా కలిపి సన్నటి సెగమీద ఉంచాలి. తరువాత ఉడికించి ఉంచిన సేమ్యాను కూడా పాకంలో వేసి, పొడిపొడిగా అయ్యేవరకూ ఉంచి తీస్తే బాంబినో తీపి పొంగల్ రెడీ..!