ఒంట్లో వేడిని తగ్గించే "మూంగ్ హల్వా"
కావలసిన పదార్థాలు :పెసరపప్పు.. 2 కప్పులునెయ్యి.. అర కప్పుపంచదార..1 కప్పుకోవా.. అరకప్పుయాలకుల పొడి.. పావు టీ.జీడిపప్పు.. 2 టీ.కిస్‌మిస్.. 2 టీ.తయారీ విధానం :ముందుగా పెసరపప్పును నానబెట్టి మెత్తగా రుబ్బుకోవాలి. పంచదార, పెసరపప్పు మిశ్రమం కలిపి ఉడికిస్తూ.. నెయ్యిని కూడా అందులో చేర్చాలి. తరువాత కోవా కలిపి, యాలకుల పొడి, కిస్‌మిస్, జీడిపప్పు కలిపి దించేయాలి. అంతే వేడి వేడి పెసరపప్పు హల్వా రెడీ. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. వేడిచేసిన వారు ఇది తింటే చలువ చేస్తుంది.