ఎండుకొబ్బరితో "కోవా కజ్జికాయలు"
కావలసిన పదార్థాలు :పాలు... ఒక లీటరుపంచదార... అరకేజీబెల్లం... అరకేజీఎండుకొబ్బరి చిప్పలు... నాలుగుయాలకుల పొడి... అర టీ.తయారీ విధానం :పాలు మరగకాచి, చిక్కబడిన తరువాత పంచదార వేసి గరిటెతో కలుపుతూ దగ్గరగా వచ్చిన తరువాత యాలకుల పొడి వేయాలి. అది బాగా ఇగిరిన తరువాత రోట్లో వేసి నూరి కోవాలాగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. బెల్లం పాకంపట్టి, తురిమి ఉంచుకున్న ఎండుకొబ్బరిని అందులో వేసి మెల్లగా గట్టిపడేంతదాకా పొడి పొడిగా కలపాలి.ఆరిన తరువాత ఆ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఒక్కొక్క ఉండను తీసుకుని దానిమీద పైన తయారు చేసి ఉంచుకున్న కోవాను పల్చగా రాసి పళ్ళెంలో పెట్టుకుని బాగా ఆరిన తరువాత పొడి డబ్బాలో నిల్వచేసుకుని వాడుకోవచ్చు. ఇవి తినడానికి చాలా రుచిగా ఉంటాయి.