కావలసిన పదార్థాలు :
పండిన అరటిపండ్లు... ఆరు
పాలు... అర లీటరు
పంచదార... రుచికి సరిపడా
యాలకుల పొడి... అర టీస్పూన్
పనస తొనలు... మూడు (సన్నగా ముక్కలు చేసినవి)
తయారీ విధానం :
అరటిపండ్లను మెత్తటి గుజ్జులాగా చేసి... అందులో పాలు, పంచదార, యాలకుల పొడి వేసి బాగా కలుపుతూ చిక్కగా చేసుకోవాలి. తరువాత తరిగి ఉంచుకున్న పనస తొనల ముక్కలను కూడా కలిపి.. మట్టి పాత్రలో పోసి ఫ్రిజ్‍లో ఉంచాలి. అంతే అరటిపండ్లతో శ్రీకర్ణి తయారయినట్లే...! బాగా చల్లబడిన తరువాత దీనిని తీసి తింటే అద్భుతమైన రుచితో మిమ్మల్ని అలరిస్తుంది.