కావలసిన పదార్థాలు :
బియ్యం... అరకేజీ
పాలు... పావు లీటర్
యాలకులు... ఇరవై
నెయ్యి... అరకేజీ
జీడిపప్పు... 20 గ్రాములు
పళ్లానికి రాసేందుకు నెయ్యి... ఆరు టీస్పూన్లు
తయారీ విధానం :
బియ్యం బాగా కడిగి శుభ్రం చేసుకుని నానబెట్టుకోవాలి. తరువాత ఈ బియ్యాన్ని గ్రైండర్‌లో బాగా మెత్తగా రుబ్బుకోవాలి. స్టవ్‌పై గిన్నె పెట్టి పాలు, బియ్యంపిండి కలిపి పోయాలి. ఇది కొంచెం కాగిన తరువాత పంచదార, నెయ్యి వేసి తిప్పుతూ ఉండాలి.
పిండి అడుగంటకుండా చూసుకుంటూ, యాలక్కాయలు పొడిచేసి అందులోనే వేయాలి. చివరిగా దించబోయే ముందుగా జీడిపప్పు వేసి బాగా తిప్పాలి. ఒక పళ్ళెంలో నేతిని రాసి ఈ పిండిని పోయాలి. ఇది వేడిగా ఉండగానే ఇష్టమైన షేపుల్లో కట్ చేసుకుని సర్వింగ్ డిష్‌లో పెట్టి అలంకరించాలి. అంతే అమృత గుళికలు రెడీ అయినట్లే..!