బ్రెడ్ హల్వాకు కావలసిన పదార్దాలు:
బ్రెడ్ ముక్కలు: రెండు కప్పులు
బటర్: 3 టేబుల్ స్పూన్లు
యాలకుల పొడి: 1 టేబుల్ స్పూన్
బాదం పప్పు: అరకప్పు
జీడి పప్పు: అరకప్పు
చక్కెర : రుచికి సరిపడా.
తయారు చేసే విధానం:
ముందుగా చక్కెర, యాలకుల పొడి మిశ్రమాన్ని తగినంత నీటితో కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత నాన్‌స్టిక్ పెనం మీద నెయ్యి వేసి బ్రెడ్ ముక్కలను దోరగా వేయించుకోవాలి. బాగా వేగిన బ్రెడ్ ముక్కలను ముందుగా తయారు చేసి ఉంచుకున్న చక్కెర, యాలకుల మిశ్రమంలో వేసి కాసేపు నాన బెట్టాలి.
ఇప్పుడు ఈ మిశ్రమం పేస్టులాగా తయారవుతుంది. ఈ మిశ్రమాన్ని వేరొక పాత్రలోకి తీసుకొని స్టవ్ మీద 3 నుంచి 4 నిమిషాల వరకూ ఉడకనివ్వాలి. బాగా చిక్కబడ్డాక వెడల్పాటి పాత్రలో పోసి బాదం, జీడి పప్పులతో అలంకరించి వేడి వేడిగా సర్వ్ చేయాలి.